రాజధాని అమరావతిలో 50 శాతంపైగా పనులు పూర్తైన నిర్మాణాలపై ముందుకు వెళ్లాలంటూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలతో పాటు పాక్షికంగా పూర్తైన నిర్మాణాలపై సీఆర్డీఏ అధికారులు మంత్రికి వివరించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు సీఆర్డీఏ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రాజధాని ప్రాంత నిర్మాణాలు ఎంతశాతం పూర్తి అయ్యాయో.. వాటికి తదుపరి ఎంత ఖర్చు చేయాల్సిన అవసరముందన్న అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి బొత్స.
అమరావతి నిర్మాణాలపై మంత్రి బొత్స సమీక్ష - సీఆర్డీఏ సమీక్షలో బొత్స న్యూస్
అమరావతిలో 50 శాతంపైన పనులు పూర్తైన నిర్మాణాలపై ముందుకెళ్లాలన్న సీఎం జగన్ ఆదేశాలతో... సీఆర్డీఏపై మంత్రి బొత్స సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణాలపై ఆరా తీశారు. పనులకు కేటాయించాల్సిన నిధులపై అధికారులతో చర్చించారు.
అమరావతి నిర్మాణాలపై మంత్రి బొత్స సమీక్ష
ఇదీ చదవండి :