Booster Dose Vaccination: కరోనా మూడోదశ, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా బూస్టర్ డోస్‌పై ఆసక్తి నెలకొంది. కేంద్రం ఆదేశాల మేరకు.. నేటినుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్ డోస్‌లు పంపిణీ చేపట్టనున్నట్టు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు 60 ఏళ్లు దాటి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.
వ్యక్తిగత ఇష్టంతోనే బూస్టర్టీకా..
బూస్టర్ డోస్ పూర్తిగా వ్యక్తిగత ఇష్టంతో కూడుకున్నదని పేర్కొన్న ఆరోగ్య శాఖ... వైద్యులను సంప్రదించిన అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. గతంలో తీసుకున్న టేకానే తిరిగి మూడో డోస్‌గా ఇవ్వనున్నట్టు పేర్కొంది. గతంలో చేసుకున్న టీకా రిజిస్ట్రేషన్ ఆధారంగా కోవిన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్న వైద్యారోగ్యశాఖ... నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.