Bonda Uma on Power Charges: జగన్ అసమర్ధత, అవినీతి వల్లే విద్యుత్ వ్యవస్థ గాడి తప్పిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మద్యం, ఇసుక, గనుల్లో వచ్చే కమిషన్లపై పెట్టిన శ్రద్ధ.. జగన్‌కు పేదలపై లేదని అన్నారు. ప్రజలపై భారం మోపడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పేదవర్గాలపై మోయలేని భారం మోపుతున్నారని తెలిపారు.పేదలు, మధ్యతరగతిపై అధికంగా విద్యుత్ చార్జీలు పెంచి... ధనవంతులపై భారం తగ్గించడం పిచ్చి తుగ్లక్ పాలన కాక మరేంటని ప్రశ్నించారు. జగనన్న బాదుడే బాదుడు పథకంలో ప్రజలపై రూ. 38వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని బొండా ఉమా మండిపడ్డారు.
జగన్‌కు కమిషన్లపై ఉన్న శ్రద్ధ..పేదలపై లేదు: బొండా ఉమా - AP News
Bonda Uma on Power Charges: సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకే సీఎం జగన్ కరెంటు ఛార్జీలు పెంచారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పేదలు, మధ్యతరగతిపై కరెంటు ఛార్జీలు అధికంగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని ఊరూరా చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని ఊరూరా చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతూ ప్రజలను నయవంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైకాపా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని తెలిపారు. ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే ధరల స్థిరీకరణ నిధి పెట్టి... ప్రజలపై భారం పడకుండా చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి:జగన్ అసమర్థ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపే నిదర్శనం: అచ్చెన్నాయుడు