మాచర్ల ఘటన ప్రజాస్వామ్యవాదులను కలవరపరిచిందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ వాపోయారు. బుద్ధా వెంకన్నను, తనను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని బొండా ఉమ అన్నారు. ఘటన వెనుక పిన్నెల్లి హస్తం ఉందని ఆరోపించారు. ఏం చేశామని మమ్మల్ని చంపాలనుకున్నారని బొండా ఉమ ప్రశ్నించారు.
జెడ్పీటీసీల నామినేషన్లు ఆపడంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాం. న్యాయవాదితో సహా పోలీస్‌స్టేషన్‌కు 3 కార్లలో వెళ్లాం. వైకాపా నేతలు కారంపూడి నుంచి మమ్మల్ని అనుసరించారు. మాచర్ల పట్టణంలోకి ప్రవేశించగానే మా న్యాయవాది కారు ఆపారు. కర్రలు, రాళ్లపై దాడి చేశారు. 30 మంది వచ్చి మా కారుపై దాడి చేశారు. మా కారు డ్రైవర్ చాకచక్యంగా మమ్మల్ని కాపాడారు - బొండా ఉమ
మాచర్ల దాటి వెళ్తుండగా మరికొంతమంది అడ్డుకున్నారని బొండా ఉమ అన్నారు. గురజాల డీఎస్‌పీ వాహనంపైనా దాడి చేసేందుకు ప్రయత్నించారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్‌కు వెళ్తున్న ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. కారుతో బాలుడిని ఢీకొట్టామని పిన్నెల్లి అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. దాడి సమయంలో గురజాల డీఎస్‌పీ రాకుంటే మమ్మల్ని చంపేసేవారని బొండా ఉమ అన్నారు.
'పిన్నెల్లికి సవాలు చేస్తున్నా.. మళ్లీ రేపు మాచర్ల వస్తా.. చూసుకుందాం. మీరు చంపుతాం అంటే మేం పారిపోతామా?. మాచర్ల వచ్చి సమాధానం చెప్పగల సత్తా మాకుంది. మా రక్తం కళ్ల చూశావు.. మా కార్లు ధ్వంసం చేశావు.' -బొండా ఉమ
ఇదీ చదవండి : మాచర్లలో ఉద్రిక్తత: బుద్దా, బోండా ఉమపై వైకాపా శ్రేణుల దాడి