దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీపై వివక్ష చూపుతోందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిని అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎలాంటి కేసులూ లేని అయ్యన్న, యనమల, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు.
పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని బొండా ఉమ విమర్శించారు. ఉన్నతవిద్య అభ్యసించిన పోలీసు అధికారులు... అధికార పార్టీ ఒత్తిళ్లకు లొగ్గి చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దని కోరారు. ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని బొండా ఉమ చెప్పారు.