"పెయిడ్ ఆర్టిస్ట్‌లతో కట్టుకథ అల్లుతున్నారు" - బోండా ఉమ లెటేస్ట్ న్యూస్ట
రాజధానిపై ప్రజలకు నిజాలు తెలియజేసేందుకే చంద్రబాబు ఈ నెల 28న అమరావతిలో పర్యటిస్తారని బొండా ఉమా అన్నారు. వైకాపా ఎన్ని అడ్డంకులు స్పష్టించినా.. ఈ పర్యటనను ఆపలేదని స్పష్టం చేశారు.
వైకాపా పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకువచ్చి చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకోవాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆక్షేపించారు. ఈనెల 28న చంద్రబాబు రాజధాని పర్యటన కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించిన వైకాపా... అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా దానిని ఎందుకు బయటపెట్టలేకపోయిందని ప్రశ్నించారు. అవినీతి నిరూపించలేకపోయింది కాబట్టి వైకాపా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు రాజధానిలో పర్యటించి వాస్తవాలు ప్రజలకు తెలియచేస్తారని స్పష్టంచేశారు. అమరావతిని ఈ ఆరు నెలల్లో వైకాపా ఏమి చేసింది అనేది చంద్రబాబు చెప్తారన్నారు.