ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తాజా నివేదిక ఇవ్వండి' - నానావతి ఆసుపత్రి

భీమా కోరేగావ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వరవరరావు.. జనవరి 13వ తేదీ వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతారని ముంబయి హైకోర్టు స్పష్టం చేసింది. విరసం సభ్యుడి ఆరోగ్య పరిస్థితిపై తాజా నివేదికను సమర్పించాలంటూ.. ఆసుపత్రిని కోర్టు ఆదేశించింది.

varavara-rao
భీమా కోరేగావ్ కేసు

By

Published : Jan 9, 2021, 1:23 PM IST

ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తాజా నివేదికను సమర్పించాలంటూ.. ముంబయి హైకోర్టు, నానావతి ఆసుపత్రిని ఆదేశించింది. జనవరి 13వ తేదీ వరకు ఆయనను ఆస్పత్రిలోనే ఉంచాలని కోర్టు సూచించింది.

భీమా కోరేగావ్ కేసులో అరెస్టై, తలోజా జైల్లో ఉన్న వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో.. ఆయన భార్య గతేడాది అక్టోబర్​లో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు అతనిని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details