ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్యాచారాలకు పబ్స్‌ కారణం కాదు.. చూసే విధానంలోనే: సోనూసూద్‌ - Bollywood actor sonusood latest news

Sonu sood on Jubliee Hills Rape Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్మీషియా పబ్‌ మైనర్‌ బాలిక అత్యాచార ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ స్పందించారు. ఇలాంటి ఘటనలకు పబ్స్‌ కారణమనేది తప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని పేర్కొన్నారు.

Sonu sood on Jubliee Hills Rape Case
Sonu sood on Jubliee Hills Rape Case

By

Published : Jun 15, 2022, 10:18 AM IST

Sonu sood on Jubliee Hills Rape Case:తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్‌ బాలిక గ్యాంగ్‌రేప్‌ ఘటనపై బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ స్పందించారు. ఈ ఘటనను న్యూస్‌లో చూసి షాక్‌కు గురి అయ్యానని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద క్రైం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులో మైనర్‌.. మేజర్‌ అని కాదు... చేసిన నేరం చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నింతితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని కోరారు.

ఇలాంటి ఘటనలకు పబ్స్‌ కారణమవుతున్నాయనేది చాలా తప్పు అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూాడా మైనర్ అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నట్లు వివరించారు. మనం ఆలోచించే పద్ధతిలోనే ఉంటుందని చెప్పారు. అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారని అంటున్నారు కానీ.. మనం చూసే విధానం తప్పుగా ఉంటే.. చెడు ఆలోచనలే వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచార నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details