ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SONU SOOD HELP: సోనూసూద్ దాతృత్వం... ఈసారి ఏం చేశారంటే..

కష్టం మనింటి తలుపు తడితే.. మనం తొక్కాల్సిన గుమ్మం అదే అనేంతలా మారిపోయింది ఆ వ్యక్తి పేరు. గుడికెళ్తే దేవుడు ఆదుకుంటాడో లేదో తెలియదు కానీ.. మన కష్టం ఆయనకు తెలిస్తే మాత్రం వెంటనే స్పందించే తత్వం ఆ వ్యక్తిది. ప్రతి మనిషికి దేవుడు చేతులిచ్చింది పని చేసుకుని బతకడానికి అనుకుంటాం.. కానీ అతను మాత్రం సాయం చేయడానికి, కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవడానికే అనుకుంటారు.

Bollywood actor and philanthropist Sonu Sood has shown his generosity yet ag
Bollywood actor and philanthropist Sonu Sood has shown his generosity yet ag

By

Published : Oct 20, 2021, 5:33 PM IST

కష్టంలో ఉంటే ఆదుకునే వారు చాలా తక్కువమంది. ఉన్నంతలో సాయం చేసే వారు ఇంకొంతమంది. కానీ ఉన్న సమస్య గురించి సమాచారామందిన వెంటనే స్పందించే ఏకైక వ్యక్తి మాత్రం సోనూసూదే. కరోనా సృష్టించిన విలయ తాండవంలో రోడ్డున పడిన ఎందరికో బాసటగా నిలిచిన సోనూసూద్.. ఎందరికో దేవుడు అయిపోయారు. రీల్​లైఫ్​లో సోనూసూద్ విలన్. తెరపై అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు. విలనిజం అంటే ఇలానే ఉండాలి అనే మార్క్​ను సృష్టించారు. నిజజీవితంలో మాత్రం ఎంతో సౌమ్యంగా ఉంటూ అందరికీ సాయం చేస్తున్నారు. ఒకప్పుడు సోనూ అంటే పేరు మాత్రమే. ఇప్పుడు మాత్రం వలసకూలీల పాలిట దైవంగా మారారు.

బాబుకు గుండె ఆపరేషన్..

తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు.

దీనిపైన వెంటనే స్పందించిన సోనూసూద్..వారిని ముంబయి రప్పించుకున్నారు. ముంబయిలోని వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్‌ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్ కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

భయపడొద్దు, నేనున్నానంటూ భరోసా..

కొన్నిరోజుల క్రితం వరకు అతి సాధారణంగా కనిపించిన నటుడు సోనూసూద్.. ప్రస్తుతం చాలామందికి ఆపద్బాంధవుడిగా మారాడు. ఆంధ్రప్రదేశ్​లోని ఓ రైతు.. ఎద్దుల్లేక తన కుమార్తెలతో ఇటీవలే కాడి మోయించాడు. దానిని వీడియో తీసిన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఎక్కడో ముంబయిలో ఉన్న ఓ సాధారణ నటుడు అది చూసి.. మీకు నేనున్నాను, తర్వాతి రోజు ఉదయానికల్లా ఎద్దుల జత అందేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చాడు. ఎద్దులైతే మళ్లీ ఇబ్బంది రావొచ్చేమోనని, ఏకంగా ట్రాక్టర్​నే వాళ్ల ఇంటికి పంపించాడు. ఇలా వీళ్ల ఒక్క కుటుంబానికే కాదు.. లాక్​డౌన్​ ప్రభావంతో వలసకూలీల నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థుల వరకు చాలామందికి తన సొంత ఖర్చులతో చేతనైనా సాయం చేశాడు. ఏం భయపడొద్దు, తానున్నానంటూ భరోసా కల్పించాడు.

లాక్​డౌన్​లో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీల ఇబ్బందులు తెలుసుకున్న సోనూసూద్.. తన సొంత ఖర్చుతో వీలైనంత మందిని వారి స్వస్థలాలకు చేర్చారు. ముంబయి కార్పొరేషన్​తో కలిసి, పేదలకు ప్రతిరోజూ ఉచితంగా భోజనమూ అందించారు. ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకున్న సోనూసూద్.. కూలీలతో తన అనుభవాలు పుస్తక రూపమివ్వనున్నట్లు స్పష్టం చేశారు.

లాక్​డౌన్​ సమయంలో మరణించిన, గాయపడిన వలసకూలీల కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు సోనూసూద్. ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి 400 కుటుంబాల జాబితా తెప్పించి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

దీనితోపాటే లాక్​డౌన్​ వల్ల ఉఫాది కోల్పోయిన వలస కార్మికుల సంక్షేమం కోసం 'ప్రవాసీ రోజ్​గార్' పేరుతో ఓ యాప్​ను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పనలో భాగంగా ఓ ఆన్​లైన్​ ఫ్లాట్​ఫామ్​ను రూపొందించారు. ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి.

ఇవీ చూడండి:

Chandrababu: వైకాపా దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష.. శనివారం అమిత్‌ షాతో భేటీ!

ABOUT THE AUTHOR

...view details