పచ్చని మొక్కలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య కనిపిస్తున్న ఈ యోగ కేంద్రం పేరు బోధి యోగ. నగరవాసులకు యోగా నేర్పించడమే కాక.. ప్రపంచానికి మరింత చేరువ చేయాలన్నదే ఈ కేంద్రం లక్ష్యం. ఇందులో సాధారణ యోగాతో పాటు.. ప్రీ నేటల్ యోగ, పవర్ యోగ, పెల్లాటిస్, యాక్రో యోగ, వైఐఎన్ యోగ, థెరపిట్యుక్ యోగా వంటివి సాధన చేయిస్తున్నారు.
పేదలకు ఉచితం
యోగాసనాలు వేసే వారికి సులభంగా ఉండేదుకు స్ట్రింగ్స్ని వాడటం ఇక్కడి ప్రత్యేకత. అనారోగ్యం కారణంగా యోగా నేర్చుకోవాలనుకునే వారికోసం ముందుగా బోధి ఆయుర్వేద ఆస్పత్రి వైద్యుల సలహాతో తగిన ఆసనాలు వేయిస్తుంటారు. నిరు పేదలై, అర్హత కలిగిన వారికి ఉచితంగా అంతర్జాతీయ యోగా గురు శిక్షణ ఇస్తున్నారు. రెండు నుంచి మూడు నెలల పాటు ఇవ్వనున్న ఈ శిక్షణలో ప్రతిభ గలవారికి స్కాలర్షిప్ల సౌకర్యమూ ఉంది.