ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హుస్సేన్ సాగర్​లో​ ఆగిన బోటు.. అందులో 60 మంది పర్యాటకులు - hyderabad rains

Hussain Sagar: నిన్న తెలంగాణలోని హుస్సేన్ సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో నీటి మధ్యలో బోటు ఆగింది. బుద్ధుని విగ్రహం నుంచి వెనక్కి వస్తుండగా బోటు ఆగింది. స్టీమర్ బోట్లతో పెద్ద బోటును టూరిజం సిబ్బంది ఒడ్డుకు చేర్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హుస్సేన్ సాగర్​లో​ ఆగిన బోటు
హుస్సేన్ సాగర్​లో​ ఆగిన బోటు

By

Published : Jul 14, 2022, 10:00 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక కారణాలతో 60 మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్‌ మధ్యలో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. నిన్న జరిగిన ఈ ఘటనపై ఓ టూరిస్ట్‌ ట్వీట్‌ చేయడంతో తాజాగా వెలుగుచూసింది. ‘60 మంది సందర్శకులతో నిన్న ఓ బోటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లింది. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో గాలుల తీవ్రతతో ఇంజిన్‌ ఆగిపోయింది. దీంతో టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. స్టీమర్‌ బోట్ల సహాయంతో పెద్ద బోటును ఒడ్డుకు చేర్చారు’ అని ఆనంద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనిపై టూరిజం ఎండీ మనోహర్ స్పందించారు. గాలుల తీవ్రత ఎక్కువైనప్పుడు ఒడ్డుకు వచ్చే సమయంలో బోటు ఇంజిన్‌ స్లో చేస్తామని, అవసరమైతే స్టీమర్‌ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామని చెప్పారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లో టూరిస్ట్‌ బోటును తిప్పడం లేదని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details