ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Inter Booklet Paper: ఇంటర్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు మార్గదర్శకాలు.. ఏంటంటే..!

Inter Booklet Paper: ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటర్‌ విద్యామండలి మార్గదర్శకాలు విడుదల చేసింది. పరీక్ష సమయంలో విద్యార్థులకు 24 పేజీల జవాబు పత్రం అందిస్తారు. అందులోనే జవాబులు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

By

Published : Apr 10, 2022, 9:29 AM IST

Inter Booklet Paper
ఇంటర్‌లో 24పేజీల జవాబు పత్రం

Inter Booklet Paper: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు 24 పేజీల జవాబు పత్రం అందిస్తారు. దీంట్లోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంటర్‌ విద్యామండలి మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రశ్నపత్రాల కోడింగ్‌కు సంబంధించి ఏ రోజుకారోజు కోడ్‌ నంబర్ల సమాచారాన్ని బోర్డు నుంచి పంపిస్తారు. విద్యార్థులను ఉదయం 8.45గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. 9.30గంటల వరకు మరుగుదొడ్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకూడదు.

ABOUT THE AUTHOR

...view details