ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు.. ఉన్నత విద్యా మండలి ప్రకటన - విద్యార్థులకోసం రాష్ట్ర వ్యాప్తంగా 54 ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా మండలి ప్రకటన

రానున్న విద్యాసంవత్సరానికి ఇంటర్​ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం 54 సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటుచేసింది. ఈ ప్రక్రియ బుధవారం నుంచి 17 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

degree online admissions
డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ప్రకటన

By

Published : Jan 5, 2021, 11:02 PM IST

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీల్లో ప్రవేశాలకు విద్యార్థులు బుధవారం నుంచి 17వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు.

విద్యార్థుల దరఖాస్తుకు:

వెబ్‌సైట్‌ https://oamdc.ap.gov.in ద్వారా డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

54 ప్రత్యేక సహాయ కేంద్రాలు:

ఏపీలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు హాల్ టిక్కెట్ నెంబర్ నమోదు చేసి, తల్లితండ్రుల వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. ఇతర బోర్టుల ద్వారా ఉత్తిర్ణులైన వారు ధ్రువ పత్రాల పరిశీలన సహాయ కేంద్రాలను ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 54 సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ 152, ఎయిడెడ్ 120, ప్రైవేట్ 1,062, రెండు విశ్వవిద్యాలయ కళాశాలల్లో 4,92,820 సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిణ జరగనుంది. ఆన్​లైన్​లో ప్రైవేట్, ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కలిగిన.. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహిస్తాయి.

నాలుగేళ్ల డిగ్రీకి పట్టా ఇలా..

ఈ సంవత్సరం నుంచి కొత్తగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాయి. విద్యార్థులు మూడేళ్లు చదివిన తర్వాత కోర్సు నుంచి బయటకు వెళ్లే అవకాశాన్నిత కల్పించారు. వారికి మూడేళ్లకు డిగ్రీ పట్టా ఇస్తారు. నాలుగేళ్లు చదివే విద్యార్థులకు పరిశోధన ఆనర్స్ డిగ్రీ ప్రదానం చేస్తారు.

ఇదీ చదవండి:డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు విద్యార్థుల నిరీక్షణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details