రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందిస్తామని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కేసుల నివారణకు మందులు సమకూర్చాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాల దృష్ట్యా.. 10 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు ఆళ్ల నాని చెప్పారు. ఈ నెలాఖరుకు 2వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు రాష్ట్రానికి వస్తాయని స్పష్టం చేశారు.
బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆరోగ్యశ్రీలో చికిత్స : ఆళ్ల నాని - మంత్రి ఆళ్ల నాని
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించామన్న మంత్రి... 10వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని