బ్లాక్ ఫంగస్ చికిత్స: ఆసుపత్రుల జాబితా విడుదల చేసిన ప్రభుత్వం - ఏపీలో బ్లాక్ ఫంగస్ చికిత్స
బ్లాక్ ఫంగస్ కరోనా వారియర్స్‌ను వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో బ్లాక్‌ఫంగస్ లక్షణాలు బయటపడుతుండటం కలవరపెడుతోంది. బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తుండటంతో దీని చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఆస్పత్రుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
బ్లాక్ ఫంగస్ చికిత్స
ఆసుపత్రుల వివరాలు ఇలా ఉన్నాయి..
- 1. జీజీహెచ్ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)
- 2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్, తిరుపతి
- 3. స్విమ్స్, తిరుపతి
- 4. జీజీహెచ్, కాకినాడ (రంగరాయ మెడికల్ కళాశాల)
- 5. జీజీహెచ్ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)
- 6. జీజీహెచ్ (రిమ్స్) కడప
- 7. జీజీహెచ్, విజయవాడ
- 8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు
- 9. జీజీహెచ్, కర్నూలు
- 10. జీజీహెచ్ (రిమ్స్) ఒంగోలు
- 11. జీజీహెచ్, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల)
- 12. జీజీహెచ్ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)
- 13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం
- 14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం
- 15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)
- 16. కేజీహెచ్, విశాఖపట్నం
- 17. విమ్స్, విశాఖపట్నం