రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం వాడే ఇంజక్షన్‌ల కొరత కన్పిస్తోంది. ఈ ఇంజక్షన్‌లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. ఫంగస్ తీవత్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షల అనంతరం వైద్యులు కొందరికి మందులతో పాటు ఇంజక్షన్‌లను ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంజక్షన్ల నిల్వలు పెరుగుతున్న రోగుల అవసరాలకు సరిపోవని వైద్యవిభాగం గుర్తించి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఈ వారం 40 వేల ఇంజక్షన్‌లను సమకూర్చుకోవలసిన అవసరాన్ని వైద్య విభాగం గుర్తించింది. ఫార్మా కంపెనీలతో అవసరమైన ఇంజక్షన్‌ల కోసం మాట్లాడి సమకూర్చుకోవాలని సీఎం చెప్పారు. ఇప్పటివరకు బ్లాక్‌ఫంగస్ బాధితులకు చికిత్స ఇచ్చేందుకు 5200 ఇంజక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. అధికారికంగా రాష్ట్రంలో808 బ్లాక్‌ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
Black fungus: రాష్ట్రంలో 808 బ్లాక్ ఫంగస్ కేసులు
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటివరకు 808 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్ల కొరత కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న ఇంజక్షన్ల నిల్వలు సరిపోవని వైద్యాధికారులు తెలిపారు.
కేసుల పెరుగుదల దృష్ట్యా ఇంజక్షన్‌ల నిల్వలను పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రులలో ఉన్న ఇన్‌పేషెంట్ల పడకల విషయంలోనూ జాగ్రతలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తం 597 కోవిడ్ కేర్ ఆసుపత్రులలో46,596 పడకలు ఉంటే అందులో 32,567 పడకలలో రోగులు చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో 1,37,436 ఉన్నారు. 116 కోవిడ్ కేర్ సెంటర్లలో 52,941 పడకలకు గాను 16,689 పడకలలో ఇన్‌పేషెంట్లు చికిత్స పొందతున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ బ్లాక్‌ఫంగస్ గట్టి ఛాలెంజ్ విసురుతోంది. ఇందు కోసం కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: