ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ ఫలితాలు: 47 స్థానాల్లో భాజపా గెలుపు - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 2020

బల్దియా ఎన్నికల్లో కమలం వికసించింది. గ్రేటర్‌ పీఠాన్ని గెలుచుకోవాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పటికీ... బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఒంటరిగా మేయర్‌ పీఠంపై మరోసారి పాగా వేయాలన్న ఆశలను అధికార తెరాసకు దూరం చేసింది. నాలుగు స్థానాల నుంచి ఏకంగా 47 స్థానాలతో బల్దియా పాలకవర్గంలో రెండో అతిపెద్ద పార్టీగా ఏర్పాటైంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆ పార్టీ లక్ష్యానికి ఈ ఫలితాలు నూతనోత్తేజాన్ని నింపాయి.

bjp win seats in GHMC
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలిచిన స్థానాలు

By

Published : Dec 4, 2020, 5:17 PM IST

Updated : Dec 4, 2020, 10:51 PM IST

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ ఎన్నికలు కమలదళంలో సరికొత్త జోష్‌ నింపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న భాజపాకు బల్దియా ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధికార తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని ప్రచారానికి అనుగుణంగా గ్రేటర్‌ పోరులో ప్రజామద్దతును కూడగట్టుకుంది.

  • ఎల్బీనగర్‌ సర్కిల్‌లో అన్ని డివిజన్లను భాజపా కైవసం చేసుకుంది. 13 డివిజన్లలో కమలనాథులు పాగా వేశారు.
  • గోషామహల్‌ నియోజకవర్గంలోని 6 డివిజన్లను భాజపా గెలుచుకుంది.

భాజపా గెలుపొందిన డివిజన్లు :హబ్సిగూడ, అడిక్‌మెట్, గచ్చిబౌలి, ముషీరాబాద్‌, మోండామార్కెట్‌, చైతన్యపురి, జీడిమెట్ల, మూసారంబాగ్, వనస్థలిపురం, వినాయక్‌నగర్‌, అమీర్‌పేట,రాంనగర్‌, గుడిమల్కాపూర్‌, చిల్కానగర్‌, చిల్కానగర్‌, రామకృష్ణాపురం, సరూర్​నగర్, హస్తినాపురం, రామంతాపూర్, మల్కాజ్‌గిరి, చంపాపేట, రాంగోపాల్‌పేట, లింగోజిగూడ, రాజేంద్రనగర్‌, జియాగూడ, కొత్తపేట, సైదాబాద్‌, గౌలిపురా, బేగంబజార్, గన్‌ఫౌండ్రీ, గోషామహల్‌, నాగోల్‌, కవాడిగూడ

గెలిచిన అభ్యర్థుల వివరాలు:

1. అడిక్‌మెట్‌లో భాజపా అభ్యర్థి సునీతా ప్రకాశ్‌గౌడ్‌ విజయం

2. గచ్చిబౌలిలో భాజపా అభ్యర్థి గంగాధర్‌ రెడ్డి విజయం

3. ముషీరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఎం.సుప్రియ విజయం

4. చెతన్యపురిలో భాజపా అభ్యర్థి రంగవెంకటనర్సింహారావు గెలుపు

5. జీడిమెట్లలో భాజపా అభ్యర్థి సి.హెచ్‌. తారచంద్రారెడ్డి విజయం

6.మూసారంబాగ్‌లో భాజపా అభ్యర్థి బి.భాగ్యలక్ష్మి గెలుపు

7. మోండామార్కెట్‌లో భాజపా అభ్యర్థి కొంతం దీపిక గెలుపు

8. హబ్సిగూడలో భాజపా అభ్యర్థి చేతన విజయం

9. రాంనగర్‌లో భాజపా అభ్యర్థి కె.రవికుమార్ విజయం

10. వనస్థలిపురంలో భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి విజయం

11. అమీర్‌పేటలో భాజపా అభ్యర్థి కేతినేని సరళ విజయం

12. వినాయకనగర్‌లో భాజపా అభ్యర్థి సి.రాజ్యలక్ష్మి విజయ

13. గుడిమల్కాపూర్ భాజపా అభ్యర్థి దేవర కరుణాకర్‌ విజయం

14. కవాడిగూడలో భాజపా అభ్యర్థి రచన విజయం

15. గడ్డిఅన్నారంలో భాజపా అభ్యర్థి ప్రేమ్‌ మహేశ‌్వర్‌ రెడ్డి విజయం

16. రామకృష్ణాపురంలో భాజపా అభ్యర్థి వి.రాధ విజయం

17. సరూర్‌నగర్‌లో భాజపా అభ్యర్థి ఆకుల శ్రీవాణి విజయం

18. హస్తినాపురంలో భాజపా అభ్యర్థి బానోత్‌ సుజాత విజయం

19. రామంతాపూర్ భాజపా అభ్యర్థి బండారి శ్రీవాణి విజయం

20. గాంధీనగర్‌లో భాజపా అభ్యర్థి ఎ.పావని విజయం

21. మల్కాజిగిరిలో భాజపా అభ్యర్థి వి.శ్రవణ్‌ విజయం

22. రాంగోపాల్‌పేటలో భాజపా అభ్యర్థి సుచిత్ర విజయం

23. చంపాపేటలో భాజపా అభ్యర్థి వంగ మధుసూదన్‌ రెడ్డి విజయం

24. లింగోజిగూడలో భాజపా అభ్యర్థి ఆకుల రమేశ్‌గౌడ్‌ గెలుపు

25. రాజేంద్రనగర్‌లో భాజపా అభ్యర్థి అర్చన విజయం

26. జియాగూడలో భాజపా అభ్యర్థి బి.దర్శన్‌ విజయం

27. కొత్తపేటలో భాజపా అభ్యర్థి పవన్‌ కుమార్‌ విజయం

28. సైదాబాద్‌లో భాజపా అభ్యర్థి కె.అరుణ విజయం

29. గౌలిపురాలో భాజపా అభ్యర్థి ఎ.భాగ్యలక్ష్మి విజయం

30. బేగంబజార్‌లో భాజపా అభ్యర్థి శంకర్‌ యాదవ్‌ విజయం

31. గన్‌ఫౌండ్రీలో భాజపా అభ్యర్థి సురేఖ విజయం

32. గోషామహల్‌లో భాజపా అభ్యర్థి లాల్‌సింగ్‌ విజయం

33. నాగోల్‌లో భాజపా అభ్యర్థి సి.హెచ్ అరుణ్‌ విజయం

34. కాచిగూడలో భాజపా అభ్యర్థి కె. ఉమా రాణి గెలుపు

35. జూబ్లీహిల్స్​లో‌ భాజపా అభ్యర్థి డి.వెంకటేష్​ గెలుపు

36. మన్సూరాబాద్​లో భాజపా అభ్యర్థి కొప్పుల నరసింహ రెడ్డి గెలుపు

37. అత్తాపూర్​లో భాజపా అభ్యర్థి ఎం.సంగీత గెలుపు

38. మంగళ్‌హాట్​లో భాజపా అభ్యర్థి ఎం.శశికళ గెలుపు

39. మచ్చబొల్లారంలో భాజపా అభ్యర్థి ఎస్​.సురేష్​ గెలుపు

40. హయత్‌నగర్​లో భాజపా అభ్యర్థి కె.నావజీవన్ రెడ్డి గెలుపు

41. మౌలాలిలో భాజపా అభ్యర్థి గున్నల సునిత గెలుపు

42. నల్లకుంటలో భాజపా అభ్యర్థి అమృతా యకర గెలుపు

43. బీఎన్‌ రెడ్డి నగర్​లో భాజపా అభ్యర్థి ఎం.లచ్చిరెడ్డి గెలుపు

44. హిమాయత్‌నగర్​లో భాజపా అభ్యర్థి జి.ఎన్.వి.కె.మహలక్ష్మి గెలుపు

45. జాంబాగ్​లో భాజపా భాజపా అభ్యర్థి రాకేశ్‌ జైస్వాల్‌ గెలుపు

46.ఐఎస్‌ సదన్​లో ​లో భాజపా అభ్యర్థి శ్వేత గెలుపు

ఇదీ చూడండి :లైవ్ అప్​డేట్స్ : గ్రేటర్ ఫలితాలు.. తీర్పుపై ఉత్కంఠ

Last Updated : Dec 4, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details