2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజపా (bjp) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) చేపట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. నేటికి సంజయ్ పాదయాత్ర 10 రోజులకు చేరుకొంది. ఈ సందర్భంగా వికారాబాద్ మోమిన్‌పేట వద్ద బాణసంచా కాల్చి, బెలూన్లు ఎగురవేసి భాజపా శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. మోమిన్‌పేట వద్ద బండి సంజయ్ వంద కిలోల కేక్‌ను కట్ చేశారు.
ఈనెల 7న సంగారెడ్డిలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, 9న ఆందోల్ జోగిపేట్‌లో పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి విజయ్ సోంకర్ శాస్త్రి, మెదక్ నర్సాపూర్‌లో జరిగే పాదయాత్రలో ఛత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తదితరులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.