ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జనసేన ప్రధాన కార్యాలయానికి సోము వీర్రాజు... నాదెండ్లతో భేటీ - గుంటూరు జనసేన కార్యాలయ వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్​తో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.

janasena
జనసేన ప్రధాన కార్యలయానికి సోము వీర్రాజు... నాదెండ్లతో భేటీ

By

Published : Jan 26, 2021, 10:00 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తొలిసారిగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. జనసేన రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్​తో ఆయన సమావేశమయ్యారు. బుధవారం విజయవాడలో భాజపా - జనసేన సమావేశం ఉన్న నేపథ్యంలో వీరి కలయికకు ప్రాధాన్యత సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లా పార్టీ నేతలను నాదెండ్ల మనోహర్.. సోము వీర్రాజుకు పరిచయం చేశారు. కార్యాలయ ఆవరణలో ఇరువురు నేతలు కలియ తిరిగారు. అంతకుముందు తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన సోము వీర్రాజుకు మనోహర్ ఘనస్వాగతం పలికారు.

ఇదీ చదవండి:చెవిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు..: ఎమ్మెల్సీ అశోక్ బాబు

ABOUT THE AUTHOR

...view details