ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిర్వాసితులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది: సోము వీర్రాజు - సీఎం జగన్​పై సోమువీర్రాజు ఆగ్రహం

Somu veerraju: నీటి ప్రాజెక్టుల నిర్వాసితులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని నిలదీశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

BJP state president
సోము వీర్రాజు

By

Published : May 25, 2022, 4:09 PM IST

Somu veerraju: ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులను ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. హిరమండలం పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు వంశధార నిర్వాసితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పేర్కొన్నారు. పోలవరం పూర్తయితే సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు నీరు వస్తుందన్నారు.

సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details