జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో రాష్ట్ర భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించారు. భాజపా, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనేది తమకు ముఖ్యం కాదని.. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతామని సోమువీర్రాజు పునరుద్ఘాటించారు. ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జనసేన కూటమి సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీనికి తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని.. కుల, మత, వర్గ బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలసి పనిచేస్తామని సోము వీర్రాజు తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికే పునాది: సోము వీర్రాజు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నికపై చర్చించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు.
పవన్‌తో ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు భేటీ
Last Updated : Jan 24, 2021, 10:31 PM IST