ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకోం:కన్నా - latest news of TTD

తితిదే భూములు నుంచి గజం భూమి అమ్మినా ఊరుకునేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ధర్నా చేస్తామని చెప్పారు.

bjp-state-president-kanna
bjp-state-president-kanna

By

Published : May 24, 2020, 11:45 AM IST

Updated : May 24, 2020, 12:01 PM IST

దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తితిదే వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎందరో భక్తులు స్వామివారిపై భక్తితో తితిదేకు భూములు ఇచ్చారని అన్నారు. అలాంటి భూముల నుంచి గజం అమ్మినా మా పార్టీ వీధిపోరాటం చేస్తోందని కన్నా అన్నారు.

సింహాచలం దేవస్థాన భూములు కూడా కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 39, తితిదే, సింహాచలం భూముల రక్షణ కోసం పోరాటం చేస్తామన్న కన్నా... ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ధర్నా చేస్తామని చెప్పారు.

దేవాలయాల ఆస్తుల జోలికి వస్తే ఊరుకోం:కన్నా

'గతప్రభుత్వ అవినీతిని సరిదిద్దుతామని జగన్ ప్రజలను నమ్మించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ నిలబెట్టుకోవడం లేదు. దేవాలయ భూముల విక్రయం సహించబోమని 9 నెలలుగా చెబుతున్నాం. దేవాలయ భూములు అమ్మబోమని ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా తితిదే భూముల విక్రయానికి తెగించారు. కరోనా హడావిడిలో కొందరు దేవాలయ భూముల కబ్జాకు తెగబడ్డారు.సింహాచలం భూములు పలుచోట్ల అన్యాక్రాంతం అవుతున్నాయి. జీవో నంబర్ 39 పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. దేవాలయ భూముల్ని లాక్కోవడానికే కొత్త జీవో ద్వారా జేసీలను నియమించారన్న అనుమానం కలుగుతోంది' -

కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:

తమిళనాడులోని స్వామివారి స్థిరాస్తుల విక్రయానికి తితిదే నిర్ణయం

Last Updated : May 24, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details