ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చార్మినార్ వద్దకు వస్తా..దమ్ముంటే సీఎం కేసీఆర్ రావాలి' - bandi sanjay fiers on cm kcr

ప్రధానిపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు ఫ్రంట్లు, టెంట్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు ఇంటికి రూ.25 వేల సాయంతో పాటు కూలిన చోట ఇల్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.

bjp-state-president-bandi-sanjay
bjp-state-president-bandi-sanjay

By

Published : Nov 19, 2020, 7:25 PM IST

రేపటి నుంచి సీఎం కేసీఆర్​కు కౌంట్‌డౌన్ ప్రారంభమైందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. దేశ ప్రధానిని రాష్ట్ర ముఖ్యమంత్రి అవమానించడం సిగ్గుచేటని హైదరాబాద్​లో అన్నారు. ప్రధానిపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు ఫ్రంట్, టెంట్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు.

'చార్మినార్ వద్దకు వస్తా..దమ్ముంటే సీఎం కేసీఆర్ రావాలి'

బంగ్లాదేశ్, పాక్ దేశాల్లో ఉన్న హిందువులు ఎక్కడికి వెళ్లారో కేసీఆర్ చెప్పాలన్నారు. రాష్ట్రంలోని 80 శాతం హిందువులను తెలంగాణ నుంచి పంపిస్తారా? అని ప్రశ్నించారు. హిందువులను తెలంగాణ నుంచి పంపించేందుకే మజ్లిస్‌తో జతకట్టారా? అంటూ విమర్శించారు. హైదరాబాద్ దేశ భక్తులకు అడ్డా అని అన్నారు. జీహెచ్ఎంసీ పీఠం కట్టబెట్టాలని నగర ప్రజలను కోరుతున్నామన్నారు. భాజపా అభ్యర్థి మేయర్​ అయితే వరద బాధితులకు ఇంటికి రూ.25 వేల సాయంతో పాటు కూలినచోట ఇల్లు కట్టిస్తామని స్పష్టం చేశారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వస్తా.. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే రావాలని సవాల్​ విసిరారు. లేఖ తాను రాసినట్లు కేసీఆర్ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. ఎస్‌ఈసీకి తాను రాసిన లేఖను బహిర్గతం చేయాలని డిమాండ్​ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో ఎలాంటి పొత్తు లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తీర్థయాత్రలకు వెళ్లే పేద హిందువులను ఉచితంగా పంపాలన్నారు.

ఇదీ చదవండి:

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చ!

ABOUT THE AUTHOR

...view details