ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెలంగాణలో తెరాస, మజ్లిస్‌ దోస్తీ మరోసారి బయటపడింది' - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలో తెరాస, మజ్లిస్‌ దోస్తీ మరోసారి బయటపడిందని భాజపా నేతలు విమర్శలు గుప్పించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తాము చెప్పిందే నిజమైందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పొత్తు లేదని చెబుతూనే ఎన్నికల్లో కలిసి పోటీచేశాయని ఆరోపించారు. హైదరాబాద్‌ను తమ పార్టీ కార్పొరేటర్లు కంటికి రెప్పలా కాపాడుకుంటారని పేర్కొన్నారు.

bjp-state-president-bandi-sanjay-criticizes-trs-and-mim-parties-about-on-ghmc-elections
'తెలంగాణలో తెరాస, మజ్లిస్‌ దోస్తీ మరోసారి బయటపడింది'

By

Published : Feb 11, 2021, 4:32 PM IST

తెరాస, మజ్లిస్‌ మధ్య ఉన్న సంబంధం మరోసారి బహిర్గతమైందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో భాజపా చెప్పిన విషయం నిజమైందన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోయుంటే తెరాసకు ఒక్క స్థానం కూడా వచ్చేది కాదన్నారు. జీహెచ్‌ఎంసీలో తెరాస స్టీరింగ్‌ మజ్లీస్ చేతిలో ఉండటం ఖాయమన్నారు. నీతివంతమైన రాజకీయం చేసేదుంటే బహిరంగంగా పొత్తు పెట్టుకోవాల్సిందని హితవు పలికారు.

భాజపా కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని స్పష్టం చేశారు. పైసా అవినీతి జరిగినా... రెండు పార్టీలను రోడ్డుకు లాగుతామని హెచ్చరించారు. పొత్తు లేదన్న మజ్లిస్‌ తెరాసకు మద్దతు ఎందుకు ఇచ్చిందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. తెరాసకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details