రైతును పారిశ్రామికవేత్తగా చేయడమే భాజపా ప్రభుత్వ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కొత్త చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాల జరిగిన రైతు సదస్సు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో అన్నదాతలు అన్ని విధాలా బాగుపడతారని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు.
కొత్త వ్యవసాయ చట్టాలతో రైతే పారిశ్రామికవేత్త: సోము వీర్రాజు - నూతన వ్యవసాయ చట్టాలు
నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో మాట్లాడిన ఆయన... రైతును పారిశ్రామికవేత్త చేయడమే భాజపా లక్ష్యమని అన్నారు.
![కొత్త వ్యవసాయ చట్టాలతో రైతే పారిశ్రామికవేత్త: సోము వీర్రాజు bjp-president-somu-veerraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9922819-705-9922819-1608287899754.jpg)
bjp-president-somu-veerraju