తిరుపతిలో కేంద్రం చేసిన అభివృద్ధిపై భాజపా జాతీయ కార్యదర్శి వీడియో విడుదల చేశారు. భాజపాను రాష్ట్రంలో గెలిపించకపోయినా అభివృద్ధిలో లోటు చేయలేదన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.5.23 లక్షల కోట్ల నిధులు రాష్ట్రానికి ఇవ్వనున్నామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో 2 లక్షల నకిలీ ఓటర్ కార్డులు సృష్టించారని ఆరోపించారు. వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం, హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. తెదేపా-వైకాపా ఒక్కటై భాజపాపై కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
భాజపాపై కుట్రకు తెదేపా-వైకాపా యత్నం: సత్యకుమార్ - tirupati by election 2021
రాష్ట్రంలో భాజపా ఎదగనివ్వకుండా తెదేపా-వైకాపా ఒక్కటై కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఏపీ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని... వచ్చే ఐదేళ్లలో రూ. 5.23 లక్షల కోట్ల నిధులు ఇవ్వనున్నామని చెప్పారు.
bjp national secretary satya kumar