కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తుందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. హైదరాబాద్లో మోదీ ఏడాది పాలనపై భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు. కరోనా వల్ల ఏపీకి రూ.35 వేల కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని.. ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఇచ్చినట్లు రాంమాధవ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏపీకి రూ.45 వేల కోట్లు వస్తున్నాయని అన్నారు. కేంద్రం లక్షా 34 వేల టన్నుల ఆహారధాన్యాలు రాష్ట్రానికి ఇచ్చిందని వెల్లడించారు.
పాలనకు గుర్తుగా..
ఏడాది భాజపా పాలనకు గుర్తుగా వర్చువల్ ర్యాలీలు చేపట్టామని రాంమాధవ్ వివరించారు. కేంద్రప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కరోనా వ్యాప్తి వల్ల ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నామన్న ఆయన.. దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రతి పథకం, కార్యక్రమం తెచ్చామని వెల్లడించారు. భాజపా శ్రేణులంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అన్నీ రివర్స్..