ఏపీ ప్రభుత్వం తాము చేయాల్సిన పనులు చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తోందని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇచ్చినవి ఖర్చు చేయకుండా పక్కనపెడుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేస్తోందన్న ఎంపీ... ఏపీ ప్రభుత్వ తీరు వల్ల కొన్ని పనులు ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయదలుచుకోవడం లేదన్న టీజీ వెంకటేష్... మౌళికాభివృద్ది వసతులపై కేంద్రం దృష్టి సారించిందని వివరించారు.
'వైకాపా.. ప్రత్యేక హోదాను ఆయుధంలా వాడుకోవాలని చూస్తోంది' - BJP MP TG Venkatesh comments on ycp
కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఏపీ ప్రభుత్వం పక్కనపెడుతోందని... భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదాను ఒక ఆయుధంలా వాడుకోవాలని వైకాపా చూస్తోందన్న ఎంపీ... ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఉన్న తెదేపా ప్యాకేజీకి ఒప్పుకొని వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు.
విండ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని ఎంపీ టీజీ వెంకటేష్ వివరించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం లేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ హబ్‌లు పెడుతున్నారని... అందులో రాష్ట్ర వాటా తప్పకుండా వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదాను ఒక ఆయుధంలా వాడుకోవాలని వైకాపా చూస్తోందన్న ఎంపీ... ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఉన్న తెదేపా ప్యాకేజీకి ఒప్పుకొని వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పుడున్న వైకాపా ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడం లేదని చెప్పారు.
ఇదీ చదవండీ...:సీఎస్, మాజీ సీఎస్ నీలం సాహ్ని, ద్వివేదికి హైకోర్టు నోటీసులు