మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా... సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కాస్తా.. సన్‌సెట్ ఆంధ్రప్రదేశ్‌గా తయారవుతోందని భాజపా ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. పాలనను పూర్తి స్థాయిలో గాలికొదిలి.. పెట్టుబడిదారులంతా వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచే పరిగెత్తే పరిస్థితి తెచ్చారని విజయవాడలో విమర్శించారు. అమరావతి పరిరక్షణ నేతలు తనను కలిసిన సందర్భంగా సుజనా మాట్లాడారు. రాజధాని అంటే కారు మార్చినంత సులువు కాదని.. డబ్బుల్లేకుంటే ప్రస్తుత వసతులతోనే 20 ఏళ్ల వరకైనా ఇబ్బంది లేకుండా పాలన చేయొచ్చని చెప్పారు. ప్రభుత్వ అనుచిత చర్యను ప్రజలు అడ్డుకోకుంటే దారుణంగా నష్టపోతారని హెచ్చరించారు.
'కేంద్రం చూస్తూ ఊరుకోదు'