ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజా పాలన కాదు.. ప్రత్యర్థులపై పాలన చేస్తున్నారు'

రాష్ట్ర ప్రభుత్వ తీరును.. భాజపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. వంద రోజుల పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, రాజధాని అమరావతి నిర్మాణాన్ని వివాదాస్పదం చేశారని మండిపడ్డారు.

sujana chowdary

By

Published : Sep 11, 2019, 4:15 PM IST

100 రోజుల పాలనలో.. మీరు చేసింది ఇదే: సుజనా

రాష్ట్రంలో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం... ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటున్నట్లుగా వ్యవహరిస్తోందని భాజపా ఎంపీ సుజనా చౌదరి విజయవాడలో విమర్శించారు. ప్రత్యర్థులపైనే పాలన చేస్తున్నారని.. ప్రజలను పాలిస్తున్నట్టు లేదని అన్నారు. పోలవరం, అమరావతి ప్రాంతాలను వివాదాస్పదం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల మీద వైకాపా ప్రభుత్వానికి ధ్యాసే లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జీవనాడిగా 70 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నామనీ.. స్వాతంత్ర్యం రాకముందే ప్రాజెక్టుకు ప్రణాళిక చేశారని గుర్తు చేశారు. 1981లో పోలవరం ప్రాజెక్టుకు అప్పటి సీఎం శంకుస్థాపన చేశారన్న సుజనా... వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు మొదలు పెట్టారని.. అప్పుడే టెండర్ విధానంలోనే తప్పు జరిగిందని అభిప్రాయపడ్డారు. 14 శాతం తక్కువకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వం పీపీఏ అనుమతితోనే ప్రాజెక్టు చేపట్టిందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details