ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Magunta Agro మాగుంట ఆగ్రో మద్యం లైసెన్సులు నిబంధనలకు విరుద్ధమన్న భాజపా ఎంపీ - మాగుంట ఆగ్రో లైసెన్సులు విరుద్ధమన్న త్రివేది

Magunta Agro Liquor Licenses మద్యం తయారీదారులు, రిటైల్ లైసెన్సీలు, టోకు వ్యాపారులు ఎల్‌ 1 లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేకపోయినా ఆ 3 రకాల వ్యాపారాలు చేస్తున్న మాగుంట ఆగ్రో అనుబంధ సంస్థలు లైసెన్సులు పొందాయని భాజపా ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. ఎందులోనూ ఓకే యజమాని, భాగస్వాములు, డైరెక్టర్లు ఉండటానికి వీల్లేదన్నారు. చైన్నైలోని ఎన్‌రికా ఎంటర్‌ప్రైజ్‌ అనే మద్యం తయారీ సంస్థ చిరునామాను ఉపయోగించి ఎన్‌రిచ్‌ సంస్థ ఎల్‌-1 లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుందని వెల్లడించారు.

Liquor Licenses
మాగుంట ఆగ్రో మద్యం లైసెన్సులు

By

Published : Aug 24, 2022, 9:00 AM IST

Magunta Agro Liquor Licenses మద్యం తయారీదారులు, రిటైల్‌ లైసెన్సీలు, టోకు వ్యాపారులు ఎల్‌1 లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీల్లేకపోయినా ఆ 3 రకాల వ్యాపారాలు చేస్తున్న మాగుంట ఆగ్రో అనుబంధ సంస్థలు లైసెన్సులు పొందాయని భాజపా ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘టోకు వ్యాపారులు, తయారీదారులు, చిల్లర వర్తకందారులు అందరూ ఒక్కరే అయితే సిండికేట్‌గా మారి అధిక ధరలను వసూలు చేయడంతోపాటు, కొన్ని బ్రాండ్లను ప్రోత్సహించి, మిగిలిన వాటిని దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో అలాంటివారు ఎల్‌1 లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోకూడదని మద్యం విధానంలో షరతు విధించారు. ఎల్‌1 లైసెన్సీకి ప్రత్యక్షంగా కానీ, అనుబంధ సంస్థల ద్వారాకానీ ఎలాంటి రిటైల్‌ దుకాణాలు ఉండకూడదు.

ఎందులోనూ ఒకే యజమాని, భాగస్వాములు, డైరెక్టర్లు ఉండటానికి వీల్లేదు. ఒక సంస్థకు మరో సంస్థలో మెజార్టీ భాగస్వామ్యం కూడా ఉండకూడదు. చెన్నైలోని ఎన్‌రికా ఎంటర్‌ప్రైజ్‌ అనే మద్యం తయారీ సంస్థ చిరునామాను ఉపయోగించి ఎన్‌రిచ్‌ సంస్థ ఎల్‌1 డిస్ట్రిబ్యూటర్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఎన్‌రిచ్‌ సంస్థకు మాగుంట ఆగ్రో, పెక్సీతో సంబంధం ఉన్నప్పటికీ ఈ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకొంది. ఈ సంస్థకు అప్పటికే 4, 22, 23 జోన్లలో లైసెన్సులు ఉన్నప్పటికీ దుర్బుద్ధితో ఎల్‌1 లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినట్లు పేర్కొంటూ దిల్లీ ఎక్సైజ్‌ శాఖ 2021 అక్టోబర్‌ 25న దిల్లీ ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. ఇందులో ఒక కంపెనీ మద్యం తయారు చేయడంతోపాటు, పంపిణీ కంపెనీలో భాగస్వామిగా ఉంది. మూడు జోన్లలో పంపిణీ వ్యాపారం దక్కించుకుంది కూడా. ఇది భాజపా ఆరోపణ కాదు. ఈ అంశాలపై దిల్లీ ఎక్సైజ్‌శాఖ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ ఆ విషయాలు తమకు తెలియని చెప్పి తప్పించుకుంది. దర్యాప్తులో అన్ని విషయాలు బయటికొస్తాయి. కొందరు నిర్లజ్జగా ప్రజల ముందుకొచ్చి అబద్ధాలు చెబుతున్నారు’’ అని సుధాంశు త్రివేది ఆరోపించారు.

భాజపా ఎంపీ సుధాంశు త్రివేది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details