ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాష్ట్రం రాజధాని జీవో మారిస్తే కేంద్రం ఒప్పుకుంటుంది'

రాష్ట్రం రాజధాని జీవో మారిస్తే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని భాజపా ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకున్న ప్రభుత్వానిదే నిర్ణయమన్న జీవీఎల్‌...రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో భాజపా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు.

By

Published : Feb 5, 2020, 12:47 PM IST

Published : Feb 5, 2020, 12:47 PM IST

Updated : Feb 5, 2020, 1:05 PM IST

gvl narasimhan
భాజపా ఎంపీ జీవీఎల్

రాష్ట్రం రాజధాని జీవో మారిస్తే కేంద్రం ఒప్పుకుంటుంది

రాజధానిని మార్చడం సరైన నిర్ణయం కాదని తీర్మానించామని భాజపా ఎంపీ జీవీఎల్‌ తెలిపారు. అయితే ఈ అంశం కేంద్ర పరిధిలో లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో మారిస్తే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందన్న జీవీఎల్‌..ప్రజలను ఇంకా మభ్యపెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్ర పరిధిలోని అంశమని ముందుగానే చెప్పామన్న జీవీఎల్‌.. రాజధాని కోసం రైతులు 53 వేల ఎకరాల భూమి ఇచ్చారని అన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకున్న ప్రభుత్వానిదే నిర్ణయమన్న జీవీఎల్‌...రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో భాజపా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు.

Last Updated : Feb 5, 2020, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details