ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా నేతలు ఒత్తిడి తెస్తున్నారు...సీఎం జోక్యం చేసుకోవాలి: జీవీఎల్

ముఖ్యమంత్రి జగన్​కు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. అనంతపురం మీదుగా వెళ్తున్న 4వరుసల రహదారి విస్తరణతో లేపాక్షిలోని పురాతన కట్టడాలకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ అంశంలో సీఎం జోక్యం చేసుకోవాలని కోరారు.

By

Published : Sep 3, 2020, 3:33 AM IST

Published : Sep 3, 2020, 3:33 AM IST

bjp-mp-gvl-narasimha-rao
bjp-mp-gvl-narasimha-rao

అనంతపురం జిల్లా మీదుగా పోతున్న 4 వరుసల రహదారి విస్తరణతో లేపాక్షిలోని పురాతన కట్టడాలకు నష్టం జరుగుతోందని... భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. హిందూపురం మీదుగా మడకశిర వరకూ జరుగుతున్న విస్తరణ పనుల్లో సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. కొందరు వైకాపా నేతలు నిబంధనలకు విరుద్ధంగా విస్తరణ పనులు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రఖ్యాత బసవన్న, వీరభద్రస్వామి ఆలయాలకు హాని కలుగుతుందని జీవీఎల్ లేఖలో ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details