ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మరల్చేందుకే.. పేరు మార్పు : సీఎం రమేశ్​ - భాజపా ఎంపీ సీఎం రమేశ్

BJP MP CM RAMESH : ఎన్టీఆర్‌ అంటే ఆంధ్రులందరికీ ప్రత్యేకమైన అభిమానం.. హెల్త్‌ యూనివర్సిటీకి ఉన్న ఆయన పేరును తొలగించడం ఒక పిచ్చి చర్య అని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

BJP MP CM RAMESH
BJP MP CM RAMESH

By

Published : Sep 21, 2022, 5:51 PM IST

CM RAMESH: లిక్కర్‌, ఇసుక, మైనింగ్‌లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని.. వైకాపా అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఎన్టీఆర్‌ అంటే ఆంధ్రులందరికీ ప్రత్యేకమైన అభిమానం అని.. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడం ఒక పిచ్చి చర్య అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. కడప జిల్లాకు వైఎస్‌ఆర్‌ జిల్లా అని పేరు పెడితే ఎవరూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి నీరు వాడుకుందామంటే కాలువలు లేవని.. జగన్‌ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్​ పేరును తొలగించడం ఒక పిచ్చి చర్య

ABOUT THE AUTHOR

...view details