దేశాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా మోదీ నడిపిస్తున్నారని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేరేలా మోదీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. సామాన్యులు సైతం విమాన ప్రయాణం చేసేలా కేంద్రం సంస్కరణలు తెచ్చిందని గుర్తు చేశారు. ప్రపంచదేశాల్లో భారత్‌కు ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనలో తేలిపోయిందన్న ఆయన... భాజపా అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.
మోదీ ప్రభుత్వానికే సాధ్యమైంది: జీవీఎల్