విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తారని ఆరోపిస్తున్న కొందరు రాజకీయ నేతల మాటలను నమ్మవద్దని భాజపా నేత, ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులకు వీలుగా నిర్ణయం అమలు చేస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. అంతేకాకుండా కార్మికల భద్రతకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
'విశాఖ ఉక్కుపై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు' - విశాఖ ఉక్కు పరిశ్రమ
విశాఖ ఉక్కు పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులకు వీలుగా నిర్ణయం అమలు చేస్తామని కేంద్రం చెప్పిందని భాజపా ఎమ్మెల్సీ మాధన్ అన్నారు. కార్మికల భద్రతకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ మాధవ్
నిర్వాసితుల డిమాండ్లపై సానుకూలంగా ఉండాలని కేంద్ర ఉక్కు మంత్రిని కోరాం అని తెలిపారు. దాంతో పాటు ఉపాధి కల్పన మెరుగుపడేలా ఉండాలని, కార్మికుల ప్రయోజనాలకు విఘాతం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశామని అన్నారు.
ఇదీ చదవండి:ap legislative: ఏపీ శాసనమండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది: కిరణ్‌రిజుజు