ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయవాదుల హత్యలకు నిరసన... తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నం - telangana news

న్యాయవాదుల హత్యను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని భాజపా మహిళా మోర్చా కార్యకర్తలు నిరసన చేపట్టారు. తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన 30 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

bjp
తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నం

By

Published : Feb 18, 2021, 6:05 PM IST

తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నం

తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించిన భాజపా మహిళా మోర్చా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 30మందిని అరెస్ట్ చేసి గాంధీనగర్, నాంపల్లి పోలిస్ స్టేషన్లకు తరలించారు. న్యాయవాదుల హత్యలను నిరసిస్తూ ఈ ఆందళనను చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడుతున్న వారికే రక్షణ లేదని కార్యకర్తలు ఆరోపించారు. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తలదించుకునే ఘటన జరిగిందన్నారు. సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details