ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి... భాజపా మహిళా మోర్చా, ఆమ్ ఆద్మీ యత్నం - BJP Mahila Morcha assembly invade

భాజపా మహిళా మోర్చా నేతలు, ఆమ్​ ఆద్మీ నాయకులు.. హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వేర్వేరుగా యత్నించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మహిళా మోర్చా నేతలు డిమాండ్​ చేయగా.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్​ పోస్టులను భర్తీ చేయాలంటూ ఆమ్​ ఆద్మీ ఆందోళన చేపట్టింది.

bjp mahila morcha, aap tried to invade telangana assembly
భాజపా మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడి, ఆప్​ శాసనసభ ముట్టడి

By

Published : Mar 25, 2021, 7:47 PM IST

అసెంబ్లీ ముట్టడికి వస్తున్న మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు

భాజపా మహిళా మోర్చా నేతలు.. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. భైంసాలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. శాసనససభ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళా మోర్చా నేతలకు వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను బేగంబజార్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారంటూ మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఆమ్‌ ఆద్మీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details