ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

House Arrest: "ఆంధ్రప్రదేశ్.. అరాచకప్రదేశ్​గా మారింది" - భాజపా నేతల గృహనిర్బంధం

House Arrest:మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై... భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై తిరుపతిలో భాజపా నేతలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

bjp protest at tirupati
తిరుపతిలో భాజపా నేతల నిరసన
author img

By

Published : May 5, 2022, 11:39 AM IST

Updated : May 5, 2022, 4:33 PM IST

House Arrest: మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై... భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. చేతులకు, తలకు నల్ల రిబ్బన్లు కట్టుకుని జిల్లా కలెక్టరేట్ల వద్ద భాజపా మహిళలు నిరసన చేశారు.

భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

తిరుపతి జిల్లా:మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై తిరుపతిలో భాజపా నేతలు నిరసనకు దిగారు. భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఇంటి నుంచి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు, మద్యం విచ్చలవిడి అమ్మకాలే దారుణాలకు కారణమవుతున్నా.. అరికట్టడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు.

తిరుపతిలో భాజపా నేతల నిరసన

గుంటూరు జిల్లా: రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా... గుంటూరు కలెక్టరేట్ వద్ద భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం పాలసీనే ఈ అఘాయిత్యాలకు కారణమని... మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి యామిని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిలో... అత్యధికంగా వైకాపా నేతలు, వాలంటీర్లే ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని మండిపడ్డారు. వరుస అఘాయిత్యాలపై హోంమంత్రి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. మహిళల భద్రత విషయంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ఇదీ చదవండి: తిరుమలలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం

Last Updated : May 5, 2022, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details