ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇప్పుడు భాజపాకు బలం లేకపోవచ్చు... ప్రజలకు చేరువవుతాం...'

రాష్ట్రంలో భాజపా సొంతంగా ఎదిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు జీవీఎల్​ నరసింహారావు, సునీల్​ దేవధర్​ జోస్యం చెప్పారు. యూపీలో మాదిరిగానే ఓ బలమైన శక్తిగా ఎదుగుతామని అన్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలు.. కుటుంబ పార్టీలుగా మారాయని ఎద్దేవా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు సైకిల్​ తొక్కలేక రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నారని జీవీఎల్​ విమర్శించారు.

'రాష్ట్రంలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతుంది'
'రాష్ట్రంలో భాజపా బలమైన శక్తిగా ఎదుగుతుంది'

By

Published : Jul 30, 2020, 7:26 PM IST

ఆంధ్రప్రదేశ్​లో భాజపా ఓ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ నేతలు జీవీఎల్​, సునీల్​ దేవధర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఉత్తరప్రదేశ్​ తరహాలోకి మారనున్నాయని జోస్యం చెప్పారు. ప్రస్తుతం పార్టీకి రాష్ట్రంలో బలం లేకపోయినా.. కచ్చితంగా ప్రజలకు దగ్గరవుతామని.. సొంతంగా ఎదిగి అధికారంలోకి వస్తామని అన్నారు. ఏపీ భాజపా నూతన అధ్యక్షుడు సోమువీర్రాజును నేతలు ఘనంగా సన్మానించారు.

సోము వీర్రాజు నేతృత్వంలో బంగారు ఆంధ్రప్రదేశ్​ కోసం పార్టీ పోరాటం సాగిస్తుందని రాష్ట్ర భాజపా ఇంఛార్జీ సునీల్​ దేవధర్​ అన్నారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం పార్టీకి సమర్థంగా సేవలందించారని అన్నారు. భాజపా, జనసేన నేతృత్వంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని దేవధర్​ స్పష్టం చేశారు.

చంద్రబాబు తప్పుకున్నారు

యూపీలో ములాయం సింగ్​ యాదవ్​ మాదిరిగానే.. తెదేపా అధినేత చంద్రబాబు సైతం సైకిల్​ తొక్కలేక రాజకీయాల నుంచి తప్పుకున్నారని భాజపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుమారుడికి రాహుల్​ గాంధీ మాదిరిగా పార్టీ నడిపించే సామర్థ్యం లేదని అన్నారు. లోకేశ్​ యువ నాయకత్వాన్ని ఆకట్టుకోలేరని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీలో భాజపా మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నట్లు పార్టీ ఎంపీ జీవీఎల్​ నరసింహారావు చెప్పారు. కరోనా సమయంలో వీర్రాజు ఎంతో నిబద్ధతతో పని చేశారని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారాయని ఆయన విమర్శించారు.

ఇదీ చూడండి..

ఈటీవీ కథనాలకు స్పందన... రష్యన్ యువతికి విరాళాలు అందజేత

ABOUT THE AUTHOR

...view details