స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వ్యవహార శైలి, బహిరంగ దాడులను ప్రజలు గమనిస్తున్నారని... భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ క్రీడలో... రాష్ట్ర ప్రజలను బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించలేకపోతే తక్షణమే ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీని కోరారు.
'వైకాపా రాజ్యాంగబద్ధ సంస్థలను బెదిరిస్తోంది' - ఏపీ ఎన్నికల కమిషన్ పేరిట లేఖ
వైకాపా ప్రభుత్వ తీరు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను అగౌరవపరిచేలా ఉందని... భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో చలామణి అవుతున్న లేఖ నకిలీది అయితే... ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రం... వైకాపా, తెదేపా జాగీర్ కాదని, ఇరు పక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
భాజపా నేత విష్ణువర్థన్ రెడ్డి