తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడి అరెస్టు తీరును భాజపా నేత విష్ణుకుమార్రాజు ఖండించారు. శస్త్ర చికిత్స జరిగిన ఆయనతో.. అనిశా అధికారులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసులు రాజకీయ పెద్దల మెప్పు కోసమే అనుచితంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఏదైనా అంశంపై సామాన్యులు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే...కేసులు నమోదు చేయటం అనేది సరికాదని చెప్పారు.