భాజపా నాయకురాలు పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర భాజపా ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ మండిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా దేశ నిర్మాణానికి పనిచేసే పార్టీ భాజపా అని ట్విటర్ లో పేర్కొన్నారు . ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే పురందేశ్వరిపై కులం పేరుతో దాడి చేస్తారా? అర్హత చూసి ఆమెకు ఇచ్చిన బాధ్యతను కులంతో ముడిపెడతారా? అని ప్రశ్నించారు. అన్నీ కులమయం చేసిన వైకాపా... కులాల గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా ఉందంటూ దుయ్యబట్టారు.
ఎంపీ విజయసాయిరెడ్డిపై సునీల్ దియోధర్ ఆగ్రహం
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత సునీల్ దియోధర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే పురందేశ్వరిపై కులం పేరుతో దాడి చేస్తారా అని నిలదీశారు. వైకాపా అన్నింటిని కులమయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
r sunil deodhar fiers on mp vijaya sai
Last Updated : Sep 28, 2020, 3:25 PM IST