ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​ గారూ.. నంద్యాల ఉపఎన్నిక ఫలితంపై ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి..? - భాజపా నేత సునీల్‌ దేవ్‌ధర్‌ వార్తలు

సీఎం జగన్​పై భాజపా నేత సునీల్ దియోధర్ వాగ్బాణాలు విసిరారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై జగన్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. గతాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు.

bjp leader sunil deodhar
bjp leader sunil deodhar

By

Published : Mar 16, 2021, 4:43 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై భాజపా నేత సునీల్ దియోధర్ విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉపఎన్నికలో తెదేపా గెలిచినప్పుడు జగన్ ఏమన్నారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. గతాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. వైకాపా, తెదేపాలు అధికార, ధన బలాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని.. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ట్వీట్ చేశారు. మిమ్మల్ని సాగనంపే రోజు వస్తుందని.. భవిష్యత్తులో ప్రజలు భాజపా-జనసేనకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన ఓ వీడియోనూ పోస్ట్ చేశారు.

భాజపా నేత సునీల్ దియోధర్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details