సీపీఎస్ రద్దు విషయంలో లక్షల కుటుంబాలకు కల్పించిన ఆశలను ముఖ్యమంత్రి జగన్ వెంటనే నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం ఉద్యోగ వర్గాలకు స్పష్టత ఇవ్వాలంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. ఒక్కవారం అని చెప్పి.. ఇప్పటికే 118 వారాలు గడిపిన సర్కారు.. ఎప్పటిలోగా మాట నిలబెట్టుకుంటుందో తేల్చి చెప్పాలని కోరుతూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.
CPS: 'సీపీఎస్‌పై ఉద్యోగ వర్గాలకు స్పష్టత ఇవ్వాలి..' - cps cancellation in ap latest news
సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు స్పష్టత ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
ఉద్యోగుల్లో భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలను రేపిన జగన్.. వారి మద్దతుతో అధికారంలోకి రాగానే.. వారిని గాలికి వదిలేశారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఇప్పుడు వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఠక్కర్ కమిటీ నివేదిక ఉండగా అధ్యయనం పేరిట తాత్సారం చేస్తూ రాష్ట్రంలోని దాదాపు లక్షా 94వేల ఉద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానసిక చిత్రవధకు గురి చేస్తోందని విమర్శించారు. పింఛను నిర్ణయంపై వివాదాన్ని రాష్ట్రంలోనే పరిష్కరించుకోవాలని.. సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం స్పష్టం చేసినా రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం సిగ్గుచేటని సోము వీర్రాజు అన్నారు.
ఇదీ చదవండి: