రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నింటిలోనూ అసమర్థుడే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వాలంటీర్లతో ప్రజలను స్వేచ్ఛగా ఓట్లు వేయనీయట్లేదని.. భాజపా-జనసేన అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. భాజపాకు వస్తున్న స్పందన చూసి వైకాపా నేతలకు నిద్రపట్టట్లేదని దుయ్యబట్టారు. పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని సోము వీర్రాజు విమర్శలు సంధించారు. తిరుపతి ఉపఎన్నికలో వైకాపాకు ప్రజలు బుద్థిచెబుతారని అన్నారు.
భాజపా, జనసేన అంటే వైకాపా భయపడుతోంది: సోము వీర్రాజు - సోము వీర్రాజు
భాజపా - జనసేనకు వస్తున్న స్పందన చూసి వైకాపా నేతలకు నిద్రపట్టట్లేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. అన్నింటిలోనూ అసమర్థుడే అని విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ అన్నింటిలోనూ అసమర్థుడే: సోము వీర్రాజు