నిషేధిత పీఎఫ్‌ఐ, వైకాపా రెండూ ఒక్కటే: సత్యకుమార్ - ఏపీ తాజా వార్తలు
13:36 September 30
వైకాపాను నిషేధిత పీఎఫ్‌ఐతో పోల్చిన భాజపా నేత సత్యకుమార్
వైకాపాపై భాజపా నేత సత్యకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపాను సత్యకుమార్.. నిషేధిత పీఎఫ్‌ఐతో పోల్చారు. నిషేధిత పీఎఫ్‌ఐ, వైకాపా రెండూ ఒక్కటేనని ధ్వజమెత్తారు. రెండింటివీ విధ్వంసకర ఆలోచనలేనన్నారు. పీఎం గరీబ్‌కల్యాణ్ బియ్యాన్ని వైకాపా ప్రభుత్వం దారిమళ్లిస్తోందని ఆరోపించారు. గడప గడపకు వెళ్తున్న వైకాపాకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేకతపై సీఎం జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పులివెందులలో జగన్‌కు సగం మద్దతే ఉందని పీకే టీం సర్వేలో తేలిందని స్పష్టం చేశారు. గృహ నిర్మాణంపై సీఎం ఎన్నిసార్లు సమీక్షించినా పురోగతి లేదని విమర్శించారు. రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదన్నారు. విశాఖలో సీఎం ఇళ్లు కడితే విశాఖ అభివృద్ధి అవుతుందా అని సత్యకుమార్ ప్రశ్నించారు.
ఇవీ చదవండి: