'శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తారా..?' - శిశుపాలుడిలా 100 తప్పులు చేస్తారా
వైకాపా నేత విజయసాయిరెడ్డి తాము నిర్ణయాలన్నీ... మోదీ, అమిత్‌షాను సంప్రదించి తీసుకుంటున్నామని చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత సత్యకుమార్ స్పందించారు. ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తరువాత జరిగే పరిణామాలకు సిద్ధపడాలి మరి అంటూ ట్వీట్ చేశారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై భాజపా నేత సత్యకుమార్ ట్విట్టర్‌లో స్పందించారు.అబద్దాలలో చంద్రబాబు తమ్ముడు ఇంకొకరు తయారయ్యారని ఎద్దేవా చేశారు.మోదీ,అమిత్‌షాను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామని విజయసాయి వక్కాణించారని అన్నారు.ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారుని ఆయన ప్రశ్నించారు.శిశుపాలుడి మాదిరిగా100తప్పులు ఎప్పుడు చేయాలా...అని ఉబలాటపడుతున్నట్టుందని విమర్శించారు.తరువాత జరిగే పరిణామాలకు సిద్ధపడాలి మరి అంటూ ట్విట్టర్ లో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హెచ్చరించారు.