ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దేశ భద్రతలో ప్రధాని రాజీలేని పోరాటం చేస్తున్నారు' - modi governament

రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ...కేవలం ఆరు నెలల్లోనే దశాబ్దాలుగా నోచుకోని సమస్యలకు పరిష్కారం చూపారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు.

bjp leader kanna laxminarayna
bjp leader kanna laxminarayna

By

Published : May 31, 2020, 5:48 PM IST

దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ రాజీలేని పోరాటం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేశ చరిత్రలో కొన్ని దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు పరిష్కారం చూపారని అన్నారు.

ట్రిపుల్ తలాక్, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేసిన చరిత్ర మోదీదని కన్నా గుర్తు చేశారు. శరణార్ధుల కోసం సీఏఏ తీసుకొచ్చారన్న ఆయన.. ఇవన్నీ తొలి ఆరు నెలల్లోనే చేసి చూపించారని కొనియాడారు. ప్రధాని మోదీ తిరుగులేని ప్రపంచ స్థాయి నేతగా ఎదుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ సీఏఏని అడ్డుపెట్టుకుని అల్లర్లు సృష్టించాలని చూసిందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details