బద్వేలు ఉప ఎన్నిక భాజపా శ్రేణులకు మనోధైర్యాన్ని అందించిందని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన.. ఓటేయకపోతే సంక్షేమం నిలిపేస్తామనే హెచ్చరికతో వైకాపా బరిలోకి దిగిందని ఆరోపించారు.
ఈ ఉప ఎన్నికలో అక్రమాలతో గెలిచారని విమర్శించారు. అధికారులు, అధికార పార్టీ నేతలు ఏకమై తిరిగారన్న ఆయన.. గతంలో కంటే బద్వేలులో తాము ఎక్కువ ఓట్లు సాధించామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీచేస్తాయని స్పష్టం చేశారు.